ఎడారిలో పూల తోట వేశాడు అతను
చూసినవారంతా నవ్వారు ఇదేమి వింత అని
ఏమని చెబుతాడు
ఎంతమందికి అని చెబుతాడు
నాటి నేల ఎడారి అయ్యిందని....
మానుకి మనిషికి బ్రతుకు పై ఆశ ఒకటేనని
పూల మొక్కలు తన పంథాను మార్చుకుంటాయి అని
ఏటికి ఎదురీదడం అలవాటేనని....
తను మానుతో పెనవేసుకున్న మనిషినని...